News November 17, 2025
సిరిసిల్ల: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రైతు అంబిరీ లింగం(65) కరెంట్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. లింగం కుమారుడు అంబిరీ పూర్ణ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన లింగం ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. పొలం వద్దకు వెళ్లి చూడగా, మోటార్ స్టార్టర్ బాక్స్ వద్ద కరెంట్ షాక్ తగిలి పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.
Similar News
News April 9, 2026
NRML: వేయి ఉరుల మర్రి సాక్షిగా…!

ఆకాశమంత ధైర్యం.. అడవి పులి గర్జన.. వెరసి రాంజీగోండ్ తిరుగుబాటు! 1860 ఏప్రిల్ 9 నిర్మల్ చరిత్రలో ఒక మాయని మచ్చ. బ్రిటిష్ నిరంకుశత్వానికి పరాకాష్టగా నిలిచిన ‘వేయి ఉరుల మర్రి’ ఉదంతం వింటే నేటికీ ఒళ్లు గగుర్పుపొడుస్తుంది. అడవి బిడ్డల హక్కుల కోసం ఆంగ్లేయులను గడగడలాడించిన రాంజీ గోండ్‌ను, ఆయన వెయ్యి మంది అనుచరులను ఒకే మర్రి చెట్టుకు ఉరితీసిన పాశవిక ఘటన అది. ఆ వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా వాయువులు.
News April 9, 2026
తిరుపతి రుయాలో వాళ్లు లేకపోవడంతో..!

తిరుపతి రుయాలో రోజూ 1000కు పైగా OPలు ఉంటాయి. MBBS పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు ఇక్కడ ఇంటర్న్‌షిప్‌గా సేవలందిస్తారు. గతేడాది బ్యాచ్ సేవలు ముగియడంతో ఫిబ్రవరి నెలాఖరున వెళ్లిపోయారు. ఇదే రోజు ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు రావాలి. సిలబస్ మారడంతో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. వీరి రాక ఆలస్యం కావడంతో సేవలు సకాలంలో అందడం లేదని రోగులు చెబుతున్నారు.
News April 9, 2026
ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: భట్టి

ముదిగొండలో నిర్మాణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. భవన నిర్మాణ ప్రాంతమంతా కలియదిరిగి పనుల నాణ్యతను, పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించుకోవాలని, అవసరమైన చోట సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.


