News February 11, 2026
సిరిసిల్ల: వీల్ చైర్‌లో వచ్చి ఓటేసిన సీనియర్ న్యాయవాది

సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది, వినియోగదారుల సంక్షేమ మండలి మాజీ అధ్యక్షుడు శాంతి ప్రకాష్ శుక్లా వీల్ చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 80 సంవత్సరాల వయసున్న ఆయన ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ ప్రజాస్వామ్యంపై మక్కువతో చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఆయనకు స్థానికంగా ఉన్న పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకరించారు.
Similar News
News February 11, 2026
రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
News February 11, 2026
3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.
News February 11, 2026
IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఐఐటీ హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు(ఫిబ్రవరి 13) తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35K,ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-25K చెల్లిస్తారు. ఫిబ్రవరి 17న రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in


