News August 29, 2025
సిరిసిల్ల : ‘వెంటనే బకాయిలు రద్దు చేయాలి’

విద్యుత్ బ్యాక్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ సెస్ కార్యాలయం ముందు వస్త్ర యజమానులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం 50% సబ్సిడీతో పవర్లూమ్ పరిశ్రమలను ఆదుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాక్ బిల్లింగ్ పేరుతో 10 హెచ్పి మోటర్ లకు మినహా మిగతా వాటికి విద్యుత్ బకాయిలను వసూలు చేయడం సరైనది కాదని యజమానులు పేర్కొన్నారు. వెంటనే బకాయిలు రద్దుచేసి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News August 29, 2025
పిల్లలను యూట్యూబ్, పబ్జిలకు దూరంగా ఉంచాలి: లోకేశ్

క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ జయంతిని సందర్భంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశాల్లో క్రీడల అభివృద్ధిపై చర్చిస్తున్నామన్నారు. పిల్లలను యూట్యూబ్, పబ్జీలకు దూరంగా ఉంచి, క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు.
News August 29, 2025
రుషికొండ ప్యాలెస్‌పై మంత్రులతో కమిటీ

AP: రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కందుల దుర్గేశ్, పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామిని నియమించింది. వీరు ఈ రిసార్ట్‌ను ఎలా వినియోగించాలనే దానిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆ నివేదిక ప్రకారం సర్కార్ చర్యలు తీసుకుంటుంది.
News August 29, 2025
MBNR: పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.