News February 24, 2025
సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News November 10, 2025
CNG కాదు.. ఆత్మాహుతి దాడేనా?

<<18252445>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనకు CNG కారణమని తొలుత భావించారు. కానీ CNG పేలితే ఇంత భారీ తీవ్రత ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఉగ్రవాద దాడి లేదా ఆత్మాహుతి దాడి అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద సంస్థ ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటూ ఏ ప్రకటన చేయలేదు.
News November 10, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద బాధితుడు పెట్రోల్ బాటిల్‌తో నిరసన
> గణాంక ప్రక్రియ పకడ్బందీగా జరగాలి: కలెక్టర్
> ప్రజావాణి దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్‌తో పరిష్కరించాలి: కలెక్టర్
> కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే కడియం
> అందెశ్రీ మరణం తెలంగాణ సమాజాని తీరని లోటు: ఎమ్మెల్యే పల్లా
> సోమేశ్వర స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం
> ఆకట్టుకున్న భక్తురాలి శివుడి రంగోలి చిత్రం
News November 10, 2025
జనగామ: ప్రజావాణికి 95 దరఖాస్తులు

జనగామ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 95 దరఖాస్తులు వచ్చినట్లు ప్రజావాణి నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎమ్మార్వోలకు సంబంధించినవి 37, మున్సిపల్ దరఖాస్తులు 10, పీడీ హౌసింగ్ 9, ఎంపీడీవోలకు సంబంధించినవి 17, ఇతర శాఖలకు దరఖాస్తులు 22 వచ్చినట్లు పేర్కొన్నారు. గతవారం ప్రజావాణి రద్దు కావడంతో నేడు జరిగిన ప్రజావాణికి దరఖాస్తుదారులు పోటెత్తారు.


