News October 25, 2025
సిరిసిల్ల: వ్యాధులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం.. మానక బుగ్గయ్య(80) టీబీ, షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన బక్కయ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఉప్పలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
Similar News
News October 25, 2025
ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

TG: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
News October 25, 2025
నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలి : కలెక్టర్

నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, సి.పి.డబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కు పంపించాలని సూచించారు. స్లో సాండ్ ఫిల్టర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత మేరకు గుర్తించి అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.
News October 25, 2025
నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.


