News April 2, 2025
సిరిసిల్ల: శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి ఏ.రామదాసు తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో మే 1 నుంచి 31 వరకు 14 ఏళ్లలోపు బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు.
News November 14, 2025
మంత్రి పొన్నంను అభినందించిన సీఎం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు నుంచి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరిని కలుపుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్లారని సీఎం ఈ సందర్భంగా మంత్రి పొన్నంను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
News November 14, 2025
GNT: ‘నెలాఖరు లోపు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి’

స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెలాఖరులోపు పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ పూర్తి అయిందన్నారు. 49,209 కార్డులు పంపిణీ కాకుండా సచివాలయాల వద్ద మిగిలి ఉన్నాయని, లబ్ధిదారులు కార్డులు తీసుకోవాలన్నారు


