News January 20, 2026

సిరిసిల్ల: సదరం క్యాంపు తేదీలు విడుదల

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను సోమవారం ప్రకటించారు. ఈ నెల 21న మానసిక లోపం, వినికిడి సమస్యలు, 22న జనరల్, 28న ఆర్థోపెడిక్ సంబంధించిన లోపం ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

Similar News

News February 19, 2026

అమరావతిలో మిగిలిన భూముల సేకరణ

image

అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా 2,459 ఎకరాల భూమి పూలింగ్‌కు రాలేదు. అయతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందే రైతులు ముందుకొస్తే, వారికి ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 19, 2026

పట్టిసీమ భద్రకాళి వీరేశ్వర స్వామిని దర్శించిన శేఖర్ మాస్టర్

image

పోలవరం పట్టిసీమ శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అర్చనలు చేసి ఆశీర్వాదాలు పొందారు. శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనతో సెల్ఫీలు దిగారు.

News February 19, 2026

కర్నూలు: ప్రేమ విషయమై గొడవ.. బలవన్మరణం

image

ఆదోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన మహేశ్(20) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘మహేశ్ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడంతో ఈ విషయమై గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనై మేడపై ఇంట్లో ఉరేసుకొన్నాడు. ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు’ అని మూడో పట్టణ ఎస్ఐ రామస్వామి తెలిపారు.