News October 17, 2025

సిరిసిల్ల: సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్

image

సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై IKP సెంటర్ల బాధ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం గ్రే ఏడు రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం క్వింటాలకు అదనంగా రూ.500 ప్రభుత్వం ఇస్తుందన్నారు.

Similar News

News October 18, 2025

ఎడపల్లి వాసి నేత్ర దానం

image

ఎడపల్లిలో శుక్రవారం మృతి చెందిన కంటేడి గంగాధర్(60) నేత్ర దానం చేశారు. మృతి చెందిన అనంతరం నేత్రాలను నేత్రదానం చేయాలని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు నేత్రాలను దానం చేశారు. తన మృతి అనంతరం ఇంకొకరికి చూపును ప్రసాదించే సంకల్పంతో నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులకు గంగాధర్ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 18, 2025

సీజ్‌ఫైర్‌‌కు తూట్లు.. అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

image

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.

News October 18, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.