News March 10, 2025
సిరిసిల్ల: సమర్థవంతంగా నిర్వహణ జరగాలి: మంత్రి

నీరు వృథా కాకుండా సమర్థవంతంగా సాగునీటి నిర్వహణ జరగాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులపై సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్, ఆయిల్ ఫామ్ వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
Similar News
News December 28, 2025
మల్కాజిగిరి: సదరం సర్టిఫికెట్లు పొందేందుకు తేదీలివే

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రిలో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. జనవరి 6, 8, 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో ఈ శిబిరాలు ఉంటాయని గ్రామీణాభివద్ధి శాఖాధికారి సాంబశివరావు తెలిపారు. స్లాట్ రిసిప్టుతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించుకున్న మెడికల్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని తెలిపారు.
News December 28, 2025
కేసీఆర్ వస్తున్నారా?

TG: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి ఇవాళ ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే సభకు హాజరయ్యేది, లేనిది ఇవాళ రాత్రిలోపు క్లారిటీ రానుంది. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, ఆయన ప్రసంగం వినడానికి ఎదురుచూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మీరేమంటారు?
News December 28, 2025
MGNREGAపై కాంగ్రెస్ మొసలి కన్నీరు: కేంద్ర మంత్రి

రాజకీయ లబ్ధి కోసమే <<18686966>>ఉపాధి హామీ పథకం<<>>పై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేంద్ర మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. కొత్త చట్టం ఆమోదం పొందిన తర్వాత ఆ పార్టీ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, విధానం రెండూ లేవన్నారు. ‘ఓట్ల కోసం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టిందీ, క్రమంగా బడ్జెట్ తగ్గించిందీ ఇదే కాంగ్రెస్. వేతనాలు ఆపిందీ కాంగ్రెస్సే’ అని తెలిపారు.


