News July 3, 2024
సిరిసిల్ల: సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చు: ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన వాహనాలు, సీజ్ చేసిన వాహనాలను యజమానులు సరైన ధృవపత్రాలు చూపించి తీసుకు వెళ్లవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 వాహనాలు ఉన్నట్లు తెలిపారు. 6 నెలల లోపు తీసుకవెళ్లకపోతే తర్వాత వేలం వేస్తామన్నారు. ఇతరత్రా సమాచారం కోసం 87126 56428, 90009 10619 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Similar News
News February 19, 2026
KNR: ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుంచి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (2026-27) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఎం. నాగేశ్వర్ తెలిపారు. అర్హత గల పాఠశాలలు తమ దరఖాస్తులను మార్చి 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కార్యాలయంలో సమర్పించాలి. ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం రెసిడెన్షియల్ కింద రూ.42,000, నాన్-రెసిడెన్షియల్ కింద రూ.28,000 చెల్లిస్తారు.
News February 19, 2026
కరీంనగర్: చెక్ డ్యామ్‌ల వద్ద ఇసుక తవ్వకాలు నిషిద్ధం

నదులపై ఉన్న చెక్ డ్యామ్‌ల రక్షణ దృష్ట్యా వాటికి ఎగువ, దిగువన 300 మీటర్ల మేర ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో ఇసుక నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 18, 2026
వీణవంక జాతర ఘటనపై డీజీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసుల ప్రవర్తనపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ, కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.


