News January 20, 2026

సిరిసిల్ల: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

image

సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ 2024-25కు సంబంధించి సీఎంఆర్ డెలివరీకి చివరి తేదీ 16-02-2026, రబీ సీజన్ 2024–25కు సంబంధించిన డెలివరీకి చివరి తేదీ 28-02-2026గా నిర్ణయించినట్లు తెలిపారు. సీఎంఆర్ లక్ష్యంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News March 30, 2026

‘బైకర్’ కోసం రోజూ 32కి.మీ. రన్నింగ్!

image

‘బైకర్’ మూవీ కోసం రెండేళ్ల పాటు సూర్యోదయం కంటే ముందే తన డైలీ రోటీన్ ప్రారంభమయ్యేదని నటుడు శర్వానంద్ తెలిపారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్ కోసం ఒకానొక సమయంలో డైలీ 32KM మేర రన్నింగ్, వాకింగ్ చేసినట్లు చెప్పారు. యోగా, ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేశానన్నారు. దీంతో 7 కిలోల వరకు తగ్గినట్లు చెప్పారు. ఆపై బైకర్ పాత్రను అవగాహన చేసుకొని ఇంకా బరువు తగ్గినట్లు చెప్పారు. ‘బైకర్’ APR 3వ తేదీ రిలీజ్ కానుంది.

News March 30, 2026

అలాంటి యాడ్స్‌పై నిషేధం: రైల్వే శాఖ

image

లిక్కర్, పొగాకు, ధూమపానం వంటి అభ్యంతరకర ప్రకటనలను రైళ్లలో ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ‘స్టేషన్లు, రైళ్లలో(కోచ్‌ల లోపల, బయట) యాడ్స్ విషయంలో నైతిక విధానాన్ని అనుసరిస్తాం. ఎలాంటి ఎరోటిక్ కంటెంట్ ప్రదర్శించం. రైలు ప్రమాదాలపై పాలసీలను అందించే ప్రైవేటు బీమా కంపెనీల యాడ్స్ తీసుకోం. అన్ని ప్రకటనలను ఈ-వేలం ద్వారానే ఏజెన్సీలకు కేటాయిస్తాం’ అని వివరించింది.

News March 30, 2026

పురుషుల కంటే మహిళల జీతాలే పెరిగాయి: సర్వే

image

పురుషులతో పోలిస్తే మహిళల నామినల్ వేతనాల్లో వృద్ధి ఎక్కువగా ఉందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS-2025) తెలిపింది. 3 విభాగాల(స్వయం ఉపాధి, ఉద్యోగులు, కార్మికులు) వారీగా ఈ సర్వే చేసింది. ‘స్వయం ఉపాధి చేసుకునే పురుషుల సంపాదన 6%, మహిళల ఆర్జన 8.8% పెరిగాయి. ఉద్యోగుల్లో పురుషుల జీతం 5.8%, మహిళల శాలరీ 7.2% పెరిగాయి. లేబర్ విభాగంలో పురుషుల వేతనం 0.2% తగ్గగా, మహిళల కూలీ 5.4% పెరిగింది’ అని పేర్కొంది.