News August 29, 2025

సిరిసిల్ల: సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీ తుది ఓటర్ జాబితా ప్రచురణ

image

సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

Similar News

News August 29, 2025

మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

image

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.

News August 29, 2025

MBNR: ముగిసిన పీజీ పరీక్షలు.. 1,113 మంది హాజరు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎంకాం రెగ్యులర్ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు నేటితో ముగిశాయి. పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డాక్టర్ నాగం కుమారస్వామి పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ పరిధిలో 1,196 మంది విద్యార్థులకు గాను 1,113 మంది హాజరయ్యారని, 83 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డా.కే.ప్రవీణ తెలిపారు.

News August 29, 2025

MNCL: 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం

image

మంచిర్యాలలోని లయన్స్ భవన్ లో ఈ నెల 31న ఉచిత నేత్ర చికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రావు, ఐ క్యాంప్స్ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. శిబిరంలో 50 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారికి మరుసటి రోజు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు.