News April 5, 2026
సిరిసిల్ల: ‘సెస్’ ప్రస్థానం ముగిసినట్టే!

దేశంలోనే తొలి సహకార విద్యుత్తు సంస్థగా 1970లో ఏర్పాటైన సిరిసిల్ల ‘సెస్’ అధ్యాయం ముగిసింది. ఆర్థిక అవకతవకలు, నష్టాల నేపథ్యంలో మార్చి 31తో ముగిసిన లైసెన్స్‌ను ప్రభుత్వం పునరుద్ధరించలేదు. సంస్థ బాధ్యతలను ఎన్‌పీడీసీఎల్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై నిరసిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ భారీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ‘సెస్’ ఉనికిని కాపాడేందుకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
Similar News
News April 5, 2026
ప్రమాదాలకు నిలయంగా పుష్పగిరి నది.. చర్యలు ఎక్కడ?

వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి క్షేత్రం వద్ద నది ప్రమాదాలకు నిలయంగా మారిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పటికే ఎందరో మృత్యువాత పడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News April 5, 2026
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ చోరీకి వైసీపీ ప్రయత్నం: కొండపల్లి

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్‌ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.
News April 5, 2026
లింగ నిర్ధారణ చేయడం చట్టవిరుద్ధం: రామగుండం సీపీ

గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. PDPL, MNCL జోన్లలో పిసిపిఎన్డిటి చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు రామగుండం కమిషనరేట్లో నేడు ఆయన తెలిపారు. మొదటిసారి నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. పునరావృతం అయితే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50వేల వరకు, అంతకుమించి జరిమానా విధిస్తారని వివరించారు.


