News February 28, 2025
సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్లు నియమ నిబంధనలు పాటించాలి: రజిత

సిరిసిల్ల జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నియమ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో పీసీపీఎస్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వైద్యులు లక్ష్మీనారాయణ, అంజలి, శోభారాణి, భాస్కర్ పాల్గొన్నారు.
Similar News
News December 14, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

<
News December 14, 2025
సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు ఏవీ?

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News December 14, 2025
ఆసిఫాబాద్: మొదటి విజేతగా మహిళ

బెజ్జూర్ మండలం సుస్మీర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా తొర్రెం చంద్రకళ గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన చంద్రకళ సమీప ప్రత్యర్థి మడే సుదాన్ భాయ్‌పై 67 ఓట్లతో గెలుపొందారు.


