News March 18, 2025

సిరిసిల్ల: హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

image

వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన దార్ల జయ సోమవారం ప్రకటించిన హాస్టల్ వార్డెన్ ఫలితాల్లో రాజన్న జోన్‌లో 4వ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం చందుర్తి మండలంలో కేజీబీవీలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో డీఎస్సీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఫలితాల్లో సత్తా చాటింది. దార్ల లింగం, దేవా దంపతులు వ్యవసాయ కూలీ పని చేస్తు కుమార్తెను చదించారు.

Similar News

News March 18, 2025

ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

image

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.

News March 18, 2025

కొండగట్టులో గుర్తుతెలియని కుళ్ళిన మృత దేహం

image

గుర్తుతెలియని కుళ్ళిన మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు దిగువ ప్రాంతంలోని తుమ్మచెరువు ప్రాంతంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం మృతి చెందడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

News March 18, 2025

భార్య, అత్త వేధింపులు.. భర్త ఆత్మహత్య

image

TG: భార్యల వేధింపులతో తనువు చాలిస్తున్న భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా HYDలో అబ్దుల్ జమీర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకున్నాడు. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అతను స్నేహితులతో చెప్పుకునేవాడని సమాచారం. అబ్దుల్ సూసైడ్ చేసుకున్న రోజు ఇంట్లో వారిద్దరూ ఉన్నారని, అతను చనిపోయాక అనంతపురానికి వెళ్లారని తెలుస్తోంది. శనివారం ఈ ఘటన జరగగా సోమవారం చెడువాసన రావడంతో విషయం బయటికొచ్చింది.

error: Content is protected !!