News February 11, 2026
సిరిసిల్ల: 1 PM పోలింగ్ శాతం ఎంతంటే?

సిరిసిల్ల మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43.57 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 39 వార్డులలో 81,959 మంది ఓటర్లకు గాను 35,711 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేములవాడ మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.68 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 28 వార్డుల్లో 40,877 మంది ఓటర్లకు గాను 22,762 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News February 11, 2026
KNR: ఒక్క ఓటు.. తలరాతను మార్చే ఓటు

పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సర్పంచులు ఉన్నారు. PDPL(M) రంగాపూర్‌కు చెందిన గంట రమేష్, KNR(D) తిమ్మాపూర్(M) కొత్తపల్లికి చెందిన శోభారాణి ఒక్క ఓటుతేడాతో గెలుపొందారు. ఇప్పుడు మున్సిపల్ పోరులోనూ అదే ‘ఒక్క ఓటు’ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనుంది. ఆ నిర్ణయాత్మక శక్తి మీదే కావచ్చు! ఓటు వేయడం మన బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. వెంటనే పోలింగ్ కేంద్రం వైపు అడుగులేయండి.
News February 11, 2026
యూజర్లు మోసపోకుండా ఎయిర్‌టెల్ స్పెషల్ ఫీచర్!

బ్యాంకింగ్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.
News February 11, 2026
అల్లూరి: ఊబిలో చిక్కుకొని వ్యక్తి మృతి

మత్స్యగెడ్డ వద్ద ఊబిలో చిక్కుకొని తమర్భ వెంకటరమణ(38) మృతి చెందాడు. పెదబయలు మండలం అరడకోటకు చెందిన వెంకటరమణ బుధవారం వేలంబొడ్డ గ్రామానికి వెళ్లడానికి బోటుతీసే యత్నంలో జారిపడి ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.


