News March 2, 2026
సిరిసిల్ల: 127 మంది విద్యార్థులు గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 127 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, సీఈసీ విద్యార్థులకు పొలిటికల్ సైన్స్, బైపీసీ విద్యార్థులకు బోటనీ పరీక్ష నిర్వహించగా, మొత్తం 4764 మంది విద్యార్థులకు గాను 4637 మంది హాజరైనట్లు అధికారులు వివరించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
Similar News
News April 13, 2026
రేపు NGKL జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం ఉత్సవ సభ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా కళాజాత బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News April 13, 2026
HYD: అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న SRH vs RR ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నేడు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మ్యాచ్ అనంతరం స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్ల నుంచి అన్ని రూట్లకు రైళ్లు నడపనున్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు.
SHARE IT
News April 13, 2026
తిరుగులేనిది ‘సుగ్రీవాజ్ఞ’

కచ్చితంగా పాటించాల్సిన ఆదేశాలకు ‘సుగ్రీవాజ్ఞ’ అనే జాతీయాన్ని వాడుతున్నాం. సీతాదేవిని వెతుక్కుంటూ రామ లక్ష్మణులు రుష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు పరిచయమవుతారు. హనుమంతుడి కారణంగా వారికి స్నేహం ఏర్పడుతుంది. రాముడి సాయంతో తన అన్న వాలిని ఓడించి కిష్కింధ రాజ్యాన్ని పొందుతారు. తర్వాత సీతాదేవి ఎక్కడున్నా అన్వేషించాలని తన వానర సైన్యాన్ని ఆజ్ఞాపిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>


