News March 9, 2026

సిరిసిల్ల: 129 మంది విద్యార్థులు గైర్హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షలలో 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4437 విద్యార్థులకు గాను 4308 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించారు. పరీక్షలను జిల్లా అధికారులు పర్యవేక్షించారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని వివరించారు.

Similar News

News March 9, 2026

మెదక్: ఇంటర్‌ పరీక్షలు.. 96.80 శాతం హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్-I, ఎకనామిక్స్-I పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6,401 మందికి గాను 6,198 మంది, ఒకేషనల్ విభాగంలో 621 మందికి గాను 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొమ్మిదో రోజు మొత్తం 96.80 శాతం హాజరు నమోదైంది. DIEO మాధవి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

News March 9, 2026

ఆసిఫాబాద్‌లో దివ్యాంగులకు సదరం శిబిరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో దివ్యాంగుల కోసం మార్చి నెలలో సదరం వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెల్లడించింది. మార్చి 11న కంటి చూపు, 12న మానసిక వైకల్యం, 18న రక్తస్రావ రుగ్మతలు (సికిల్ సెల్, తలసేమియా,హిమోఫిలియా), 25న మూగ/చెవిటి, 27న ఎముకల వైకల్యాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని శిబిరాలు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతాయి.

News March 9, 2026

హాని కలగకుండా చూడాలి: జనగామ కలెక్టర్

image

ఈ-వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలం శామీర్‌పేట్ గ్రామ పరిధిలో గల డీఆర్సీ కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి వారు మాట్లాడారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సక్రమంగా సేకరించాలని, ఇతర వ్యర్థాలను వర్గీకరించి పునర్వినియోగించాలన్నారు.