News October 7, 2025
సిరిసిల్ల: ‘2.70 MT ధాన్యం వచ్చే అవకాశముంది’

ఈ సీజన్లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సిరిసిల్ల కలెక్టర్ హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఖరీఫ్ సీజన్లో 2.15 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. రైస్ మిల్లర్లు నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. అదరపు కలెక్టర్ నగేష్, అధికారులు ఉన్నారు.
Similar News
News October 7, 2025
అన్నమయ్య జిల్లాలో SIల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు SIలను బదిలీ చేస్తూ SP ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న డి.రమేశ్ బాబును రామసముద్రానికి, ఎస్.రహీమ్‌ను పీలేరు రెండో ఎస్ఐగా నియమించారు. సంబేపల్లి నూతన ఎస్ఐగా కె.రవికుమార్, వాయల్పాడు రెండో ఎస్ఐగా PV రమణయ్య బదిలీ అయ్యారు. మదనపల్లె 2టౌన్ రెండో ఎస్ఐగా బి.రామాంజనేయులు నియమితులయ్యారు. వీఆర్‌లో ఉన్న మరికొందరు ఎస్ఐలకు జిల్లా కేంద్రంలోనే పోస్టింగ్ ఇచ్చారు.
News October 7, 2025
కృష్ణా: రైతులకు నష్టం.. దళారులకు లాభం

టమాటాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో అయితే ధర లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేజీ రూ.2కి కూడా రాని పరిస్థితి ఉందని అక్కడ వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే స్థానిక మార్కెట్లలో కిలో రూ.40 చొప్పున విక్రయించడంపై వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుకు ధర రాక, దళారులు పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
News October 7, 2025
విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని పసలేని కామెంట్స్!

సినీ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడానికి రష్మికే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు రోజులకే ప్రమాదం జరిగిందని, రష్మికది ఐరన్ లెగ్ అని అంటున్నారు. కాగా అవి పసలేని వాదనలంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విజయ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటానికి రష్మికే కారణమని పాజిటివ్‌గా థింక్ చేయొచ్చుగా అని సలహాలిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?