News December 18, 2025
సిరిసిల్ల: 4 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అధికంగా గెలిచారు. ఎల్లారెడ్డిపేటలో 11, ముస్తాబాద్‌లో 13, గంభీరావుపేటలో 11, వీర్నపల్లిలో 8, మొత్తం 43 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 17, ఒక సీపీఐ అభ్యర్థి గెలిచారు.
Similar News
News December 19, 2025
అప్రమత్తతో సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి: కలెక్టర్

ఖమ్మం: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ నందు అధికారులు, సిబ్బందికి సైబర్ క్రైమ్ నియంత్రణపై కలెక్టర్ ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికీ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల కొంత మంది వాటిని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.
News December 19, 2025
పంచాయితీ ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ భేష్

కరీంనగర్ జిల్లాలో మూడు దశల పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసినందుకు కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు కలిసి అభినందించారు. ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ కాళీచరణ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
News December 19, 2025
కృష్ణా జిల్లాలో 15 మందికి కారుణ్య నియామకాలు

అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డీకే బాలాజి కొత్తగా కారుణ్య నియామకాల కింద నియమితులైన ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం ఉదయం తన చాంబర్‌లో 15 మందికి కారుణ్య నియామకాల కింద నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న వారిలో 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మీకు అప్పగించిన పనులను సజావుగా నిర్వహించాలన్నారు.


