News October 16, 2025
సిరిసిల్ల: 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే ఛాన్స్

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల కలెక్టర్ ఎం.హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి మొబైల్ యాప్‌ను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది జిల్లాలో ప్రభుత్వం 2,46,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందన్నారు.
Similar News
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
News October 16, 2025
MNCL: లొంగిపోనున్న మరో మావోయిస్టు నేత..?

అభయారణ్యంలోని మావోయిస్టులకు రోజురోజుకు గట్టి ఎదురుదెబ్బ తగలుతోంది. బుధవారం మహారాష్ట్రలో మల్లోజుల వర్గంలో లక్ష్మణచందాకు చెందిన మోహన్ బెల్లంపల్లికి చెందిన సరోజ లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మందమర్రికి చెందిన సింగరేణి కార్మిక సంఘం కార్యదర్శి బండి ప్రకాశ్ ఉరఫ్ బండి దాదా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లొంగుబాటు చర్యలకుల మద్దతిస్తున్నట్లు సికాస పేరిట లేఖ విడుదలైంది.
News October 16, 2025
ADB: సపోర్ట్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తులు

సపోర్ట్ ఇంజినీర్ పోస్టును అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అర్హతలు బీటెక్/ఎంసీఏ, టెక్నికల్ సపోర్ట్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలన్నారు. నెలకు రూ.35,000 చెల్లిస్తామని తెలిపారు. అగ్రిగేట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 2025 జులై 1 నాటికి కనీస వయస్సు 18, గరిష్టంగా 46 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుందన్నారు.