News March 29, 2025
సిరిసిల్ల: 6753 మంది విద్యార్థులు హాజరు

సిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలో 6,753 మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6,767 మంది విద్యార్థులకు గాను 6,753 మంది హాజరయ్యారని స్పష్టం చేశారు. 14 మంత్రి విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
జన సంద్రంగా మారిన శ్రీశైలం క్షేత్రం

ఇల కైలాసమైన శ్రీశైలం జన సంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి నేరుగా స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
News February 15, 2026
కోవా బన్ను వివాదం.. బాధితుడికి మంత్రి లోకేశ్ మద్దతు

AP: మేడారం జాతరలో <<19121994>>కోవా బన్ను<<>> విక్రయించిన వలి అనే వ్యక్తితో యూట్యూబర్ ప్రవర్తించిన తీరుపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది వలికి సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘వలి.. మీరు ఇలాంటివి భరించాల్సి రావడం బాధాకరం. తెలుగు సమాజంలో సామరస్యం, గౌరవం, సోదరభావం తప్ప మతపరమైన విద్వేషాలకు చోటు లేదు. మిమ్మల్ని త్వరలో కలిసి కోవా బన్ను టేస్ట్ చేస్తా’ అని ట్వీట్ చేశారు.
News February 15, 2026
త్రిమూర్తుల సంగమ రూపం శివలింగం

శివలింగం అంటే ఆకారమే కాదు. అనంత విశ్వానికి సంకేతం. ఇందులో త్రిమూర్తులు ఉంటారు. అడుగున ఉండే చతురస్రాకార బ్రహ్మ భాగం సృష్టిని, మధ్యలో ఉండే అష్టకోణాల విష్ణు భాగం(పాణిపట్టం) స్థితిని, పైన కనిపించే వృత్తాకార రుద్ర భాగం లయను సూచిస్తాయి. ఇలా ఒకే శివలింగంలో సృష్టి, స్థితి, లయకారకులు ఉండటం వల్ల దీనిని పూజించడం అంటే సమస్త బ్రహ్మాండాన్ని ఆరాధించడమే. నిరాకారుడైన పరమాత్మను ఆరాధించే అత్యున్నత రూపం ఈ శివలింగం.


