News January 3, 2026

సిరిసిల్ల: 76 మంది చుక్కేసి.. చిక్కారు..!

image

నూతన సంవత్సర సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. అన్ని పోలీసుల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. 76 మంది మద్యం తాగి వాహనాలు నడపడంతో కేసులు నమోదు చేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను స్టేషన్‌కు తరలించారని వెల్లడించారు.

Similar News

News February 14, 2026

మంచిర్యాలలో జనసేన బోణీ

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. 34వ డివిజన్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి సాగర్ తన సమీప ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాగర్ విజయం సాధించడంతో జనసైనికులు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

News February 14, 2026

గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

image

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.

News February 14, 2026

పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

image

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.