News March 9, 2025
సిరిసిల్ల SP ఫుల్ డీటెయిల్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా SPగా నియామకమైన మహేష్ బాబా సాహెబ్ గీతే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జన్మించారు. ఈయన అగ్రికల్చర్ BScలో డిగ్రీ పట్టాపొందారు. ఎలాంటి కోచింగ్ లేకుండానిరంతర సాధనతో 2020లో IPSకు ఎంపికయ్యారు. మొదట చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్ విధులు నిర్వహించారు. తర్వాత ఏటూరు నాగారం ASPగా పనిచేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా OSDగా బాధ్యతలు నిర్వహిస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా వచ్చారు.
Similar News
News March 9, 2025
సత్యసాయి జిల్లాలో యువతి సూసైడ్

శ్రీ సత్యసాయి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. మహిళకు ఇటీవల వివాహం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2025
హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.
News March 9, 2025
శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గిఫ్ట్

నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. విశ్వంభర సెట్స్‌లో ఆయన్ను చూసేందుకు శ్రీలీల వెళ్లారు. ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చిరు ఓ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారు, వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది. శ్రీలీల తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని షేర్ చేశారు.