News April 8, 2025
సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Similar News
News April 16, 2025
రామడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర, చిగురుమామిడి, రామడుగు మండలాల్లో 42.2°C నమోదు కాగా, శంకరపట్నం 41.8, గన్నేరువరం 41.7, జమ్మికుంట 41.4, మానకొండూర్ 40.9, కరీంనగర్ రూరల్, చొప్పదండి 40.7, తిమ్మాపూర్ 40.4, వీణవంక 40.3, కరీంనగర్ 40.2, హుజూరాబాద్ 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.6, ఇల్లందకుంట 39.1°C గా నమోదైంది.
News April 16, 2025
గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా యువకుడి MURDER

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం దుబాయ్‌లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట చెందిన స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య పాకిస్తానీ చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లిన శ్రీనివాస్ ఇలా హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.