News December 21, 2025
సిరి గోల్డ్‌తో నాకు సంబంధంలేదు: BJP ఖమ్మం చీఫ్

సిరి గోల్డ్ వ్యాపారంతో తనకెలాంటి సంబంధంలేదని BJP ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు స్పష్టంచేశారు. రాజకీయంగా ఎదురుకోలేకే అందులో పెట్టుబడులు పెట్టానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. ప్రజలు ఈ నిరాధార ఆరోపణలు నమ్మొద్దని కోరారు.
Similar News
News December 27, 2025
H1B వీసా జాప్యాన్ని US దృష్టికి తీసుకెళ్లిన భారత్

H1B వీసా జారీలో ఆలస్యం, అపాయింట్‌మెంట్ల రద్దు అంశాలను US దృష్టికి తీసుకెళ్లినట్లు MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ అంశం ఆ దేశ సార్వభౌమాధికారానికి చెందినదైనా.. వీసా అపాయింట్‌మెంట్ షెడ్యూల్, రీషెడ్యూలింగ్‌లో ఇబ్బందులపై వచ్చిన అనేక ఫిర్యాదుల గురించి తెలియజేశామన్నారు. వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల పలువురి కుటుంబ జీవితానికి, వారి పిల్లల చదువుకు ఇబ్బందులు ఏర్పడినట్లు జైస్వాల్ చెప్పారు.
News December 27, 2025
GNT: మంత్రి పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
News December 27, 2025
T20ల్లో హర్మన్ ప్రీత్, షెఫాలీ రికార్డులు

ఉమెన్స్: SLతో జరిగిన 3వ T20లో IND ప్లేయర్లు పలు రికార్డులు సాధించారు. తాజా గెలుపుతో T20ల్లో అత్యధిక విజయాలు(77) అందించిన కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ నిలిచారు. తర్వాత AUS ప్లేయర్ మెగ్ లానింగ్(76) ఉన్నారు. మరోవైపు ఓ T20 మ్యాచ్‌లో అత్యధిక శాతం పరుగులు బాదిన బ్యాటర్‌గా షెఫాలీ(79*) నిలిచారు. ఆమె నిన్న SLపై జట్టు స్కోరు(115)లో 68.69% రన్స్ చేశారు. ఇప్పటి వరకు 2011లో హర్మన్ చేసిన 66.12% పరుగులే అత్యధికం.


