News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.

Similar News

News December 18, 2025

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.

News December 18, 2025

అసభ్యంగా నివేద ఫొటోలు.. స్పందించిన హీరోయిన్

image

AI జనరేటెడ్ ఫొటోల <<18592227>>బెడద<<>> హీరోయిన్లను పట్టి పీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫొటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. వీటిని పోస్ట్ చేసినవారు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల పలువురు హీరోయిన్ల ఫొటోలూ ఇలాగే వైరల్ అయ్యాయి.

News December 18, 2025

నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం!

image

TG: మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌‌పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇప్పటికే ముగిసింది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాగా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని <<18592868>>అనర్హత<<>> పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే.