News February 12, 2025
సిర్గాపూర్: క్యాన్సర్‌తో యువకుడి మృతి
సిర్గాపూర్ మండలం జమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని జీవులనాయక్ తండాకు చెందిన యువరైతు వడిత్య శ్రీనివాస్(29) క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఏడాది కిందటే పెళ్లైనట్లు సమాచారం. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 12, 2025
పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు
YCP సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని HYD సైబర్‌క్రైమ్ పోలీసులకు నటుడు పృథ్వీ రాజ్ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన <<15435022>>వ్యాఖ్యల <<>>తర్వాత ఫోన్లు, మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువునష్టం దావా వేస్తానని, AP హోంమంత్రికీ ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
News February 12, 2025
ఎల్లారెడ్డి: అపార్ వివరాలను తక్షణమే పూర్తి చేయాలి: డీఈఓ
ఆపార్ వివరాలను ఆన్‌లైన్లో తక్షణమే పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఆదేశించారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బుధవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశానికి హాజరై మాట్లాడారు. యుడైస్‌లోని ఖాళీలు పూర్తి చేయాలన్నారు. సెలబస్ పూర్తిచేసి రివిజన్ చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు.
News February 12, 2025
NRPT: ప్రేమికుల రోజు అడ్డుకుంటాం: బజరంగ్ దళ్
నారాయణపేటలో ప్రేమికుల రోజును అడ్డుకుంటామని బజరంగ్ దళ్ ఉమ్మడి పాలమూరు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రవణ్, విహెచ్పి పట్టణ కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. బుధవారం నారాయణపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రేమికులకు వ్యతిరేకం కాదని అన్నారు. 2019 ఫిబ్రవరి 14 రోజు పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులయ్యారని, ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకుందామని చెప్పారు.