News December 16, 2025
సిర్గాపూర్: ప్రత్యర్థులుగా పిన్ని.. పిన కొడుకు

రాజకీయంలో చాలా చోట్ల ఇంటి పోరు సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సిర్గాపూర్ మండలం ఉజులంపాడ్ గ్రామంలో ఈ సమస్య ఎదురయింది. మొన్నటి వరకు ఒకటిగా ఉన్న వీరు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నువ్వా.. నేనా.. అంటూ విడిపోయారు. స్థానిక మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి కుమారుడు శశికాంత్ రెడ్డి, ఆయన చిన్నమ్మ పద్మజ ప్రత్యర్థులయ్యారు. శశికాంత్ రెడ్డిని కాంగ్రెస్ బలపరచగా, పిన్ని పద్మజకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలుకుతున్నారు.
Similar News
News December 16, 2025
హైదరాబాద్‌కు IIM మంజూరు చేయండి: CM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని TG సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలను కోరారు. 105 YIIRSలు నిర్మిస్తున్నామని, వీటితో 4 లక్షల మందికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఇందుకు రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి తీసుకునే రుణాలను FRBM నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. అటు హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.
News December 16, 2025
ADB: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిద్దిపేట సీపీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదుకానున్నాయని CP విజయ్‌కుమార్ ప్రకటించారు. విజయోత్సవాల్లో పటాకులు కాల్చడం, అనుమతి లేని ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండవ దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


