News January 2, 2026
సిర్గాపూర్ SC హాస్టల్ వార్డెన్ సస్పెండ్

సిర్గాపూర్ SC హాస్టల్(బాలుర) వార్డెన్ కిషన్ నాయక్‌ను జిల్లా SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత శాఖ వర్గాలు తెలిపాయి. కాగా వార్డెన్ తమను నిత్యం వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి బూతులు తిడుతున్నాడంటూ విద్యార్థులు నిన్న హాస్టల్ ముందు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వ్యవహారం పెద్దది కావడంతో విచారణ అనంతరం సదరు వార్డెన్‌పై వేటు పడింది.
Similar News
News January 6, 2026
మెదక్: దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామంలో విషాదం అలుముకుంది. లంగిడి లక్ష్మయ్య (45) కరెంట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు శ్రీకాంత్ తాగిన మత్తులో డబ్బుల కోసం గొడవపడ్డాడు. తండ్రి లక్ష్మయ్యను కొడుకు కర్రతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావం జరిగింది. లక్ష్మయ్యను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
News January 6, 2026
MNCL:విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అవసరం: ఎంపీ

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాలలోని ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ,జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.
News January 6, 2026
పరకామణి అంశంలో పోలీసు అధికారులపై కేసులకు హైకోర్టు ఆదేశం

AP: TTD పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీ, సీఐడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని ఆ రెండు విభాగాలకు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపు అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.


