News December 29, 2024
సిర్పూర్(టి): పెద్దపులి సంచారం కలకలం
సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్లో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించి గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఉదయం 10 దాటాక వెళ్లి సాయంత్రం 4 లోపే ఇంటికి చేరుకోవాలన్నారు.
Similar News
News December 29, 2024
ఫైనల్స్‌కు చేరిన ఉమ్మడి ADB జట్టు
హన్మకొండలోని జెఎన్ఎస్ మైదానంలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ సీఎం కప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రతిభ కనబర్చి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా జట్టుతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్‌లో 17గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకుంది. జిల్లా జట్టు క్రీడాకారులను, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.
News December 29, 2024
మైసూర్‌లో యాక్సిడెంట్.. మంచిర్యాల యువకుడు మృతి
కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల యువకుడు మృతి చెందాడు. దొరగారిపల్లెకు చెందిన బల్జిపెల్లి సందీప్ హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సందీప్ స్నేహితులతో కలిసి శుక్రవారం కారులో మైసూర్ వెళ్లగా శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సందీప్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సందీప్ మృతితో దొరగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 29, 2024
నిర్మల్‌లో మహిళపై అత్యాచారం.. వివరాలు వెల్లడించిన సీఐ
నిర్మల్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్‌లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.