News February 23, 2025
సిర్పూర్(టి): యువకుడిపై దాడి.. ముగ్గురి రిమాండ్

కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన అక్రమ్‌పై ఈనెల 11న ముగ్గురు దాడి చేశారు. టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ముగ్గురిపై కేసు నమోదు చేసి సిర్పూర్(టీ) కోర్టులో హాజరు పర్చగా వారిని రిమాండ్‌కు తరలించగా వారు బెయిల్‌తో బయటికి వచ్చారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ జిల్లా కోర్టులో రివిజినల్ పిటిషన్ దాఖలు చేసి నిందితుల బెయిల్‌ను రద్దు చేయించి, కోర్టులో హాజరు పరచగా మేజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News November 7, 2025
TODAY TOP STORIES

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్
News November 7, 2025
పొగాకు రైతులకు న్యాయం చేద్దాం: కలెక్టర్

ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్ వద్ద మార్కుఫెడ్ డిఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేద్దామని వివరించారు.
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.


