News March 18, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు.. మూడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మండలంలోని మధుర తండాకు చెందిన కట్కవార్ రావు సింగ్ 24/10/2021న పొలంలో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. కేసు విచారణలో భాగంగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ సదరు వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు చెప్పారు.
Similar News
News March 18, 2025
శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీపై రాజు మాట్లాడుతూ.. అది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనడంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. అయితే దీనిపై రాజు స్పందిస్తూ.. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా అంటూ విమర్శించారు.
News March 18, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నడుమ భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. 325 పాయింట్లు లాభ పడిన నిఫ్టీ 22,824 వద్ద ట్రేడ్‌ను ముగించింది. మరోవైపు, 1131 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 75,301 వద్ద ముగిసింది. అశోక్ లేల్యాండ్, వేదాంత, డీఎల్ఎఫ్, జిందాల్ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.
News March 18, 2025
నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.