News January 27, 2025
సిర్పూర్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుపై కాగజ్‌నగర్ పట్టణవాసులు సీఐ రాజేంద్రప్రసాద్ కు ఆదివారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించకుండా అగౌరవపరిచారన్నారు. అధికారిక నివాసంపై ఉన్న జాతీయ జెండా రంగు తేలినా మార్చకుండా అవమానపరిచారని తెలిపారు. జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
మేడికొండూరు: భార్య చేయి నరికిన భర్త

మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. సోమవారం అర్ధరాత్రి భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
‘కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి’

కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన తుమ్మల, ఇప్పటికే జరిగిన ఫీజిబిలిటీ సర్వేలో ప్రతిపాదిత స్థలం అనువుగా లేనందున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో స్థలాన్ని ప్రతిపాదించామని తెలిపారు. అక్కడ త్వరగా సర్వే చేసి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలన్నారు.
News September 16, 2025
వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ ఇదే.. రేపటి నుంచి దరఖాస్తులు

AP: వాహనమిత్ర పథకానికి అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి <<17704079>>అప్లై చేసుకోవాలని<<>> ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ఫామ్ రిలీజ్ చేసింది. అందులో వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలని పేర్కొంది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున నగదు జమ చేయనుంది.