News March 7, 2025
సిర్పూర్ (టి): వంతెన పైనుంచి నదిలో పడి వ్యక్తి మృతి

మహారాష్ట్రలోని పొడ్స గ్రామం మధ్యలోని నది వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ కమలాకర్ వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాంకు చెందిన ప్రశాంత్ (39) వ్యాపార నిమిత్తం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 9, 2025
ములుగు: Way2Newsలో వరుస కథనాలు.. స్పందించిన సీతక్క

ములుగు(D) కన్నాయిగూడెంలో <<18239952>>పాముకాటుతో బాలుడు<<>> హరినాద్ స్వామి(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై Way2News ప్రచురించిన వరుస కథనాలకు మంత్రి సీతక్క స్పందించారు. వైద్యం అందక బాలుడు మృతి చెందినట్లు బంధువుల ఆరోపణతో వైద్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యులతో పాటు, అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 9, 2025
NIEPVDలో ఉద్యోగాలు

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 9, 2025
పూజలో ఏ పూలు వాడాలి? ఏ పూలు వాడొద్దు?

పూజకు జిల్లెడ, గన్నేరు, మారేడు, ఉమ్మెత్త, దత్తరేణు, జమ్మి, నల్లకలువలు చాలా శ్రేష్ఠమైనవి. దాసాని, మంకన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, తోడిలేని పూలు పూజకు పనికిరావు. ఉమ్మెత్త పువ్వుకు పట్టింపు లేదు. మారేడులో లక్ష్మీదేవి, నల్లకలువలో పార్వతీదేవి, కమలంలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే, కొన్ని దేవతలను వాటికి ఇష్టమైన పువ్వులు, ఆకులతోనే పూజించాలి. కొన్ని పువ్వులను కొందరు దేవతలకు అస్సలు వాడకూడదు. <<-se>>#Pooja<<>>


