News February 24, 2025
సిర్పూర్ టీ: భీమన్న గుడి వద్ద మృతదేహం

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
కలికిరి: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు దుర్మరణం

కలికిరి పట్టణంలోని మదనపల్లి మార్గంలోని జేఎన్టీయూ కళాశాల పరిసర ప్రాంతాల్లోని రహదారుల్లో రెండు వేర్వేరు చోట్ల ఆదివారం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరికీ చికిత్స నిర్వహిస్తుండగా మృతిచెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కలికిరి పోలీసులు తెలిపారు.
News February 24, 2025
MLC ఎన్నికలు.. ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం

TG: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. NZB, ADB, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో INC తరఫున నరేందర్ బరిలో ఉన్నారు. దీంతో ఆయన తరఫున రేవంత్ ఉదయం 11.30 గంటలకు HYD నుంచి NZB చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2 గంటలకు మంచిర్యాలలో, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు.
News February 24, 2025
నరసరావుపేట: మద్యం షాపులు, బార్లు మూసివేత

పల్నాడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మణికంఠ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయాల్లో గందరగోళ పరిస్థితులు రాకుండా ఉండేందుకు తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.