News April 16, 2024

సివిల్స్‌లో ఆదిలాబాద్ వాసీకి 790 ర్యాంకు

image

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ-గీత దంపతుల కుమారుడు రేకుళ్వార్ శుభం సివిల్స్‌లో అలిండియా స్థాయిలో 790వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయంలో పదోతరగతి పూర్తిచేశాడు. అనంతరం అస్సాంలోని గువాహటి IITలో సివిల్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ ఎంపికయ్యాడు.

Similar News

News July 9, 2025

ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

image

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 8, 2025

ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

image

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.

News July 8, 2025

ADB: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్ రాజర్షి షా

image

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. వికలాంగుల ఆర్థిక పునరావాసం కోసం ఎంపిక చేసిన దివ్యాంగ లబ్ధిదారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన ఉత్తర్వుల కాపీలను ఇచ్చారు. 15 మంది దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో రూ.7.50 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు.