News March 7, 2026
సివిల్స్‌లో పాలమూరు బిడ్డల సత్తా

యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘనత చాటారు. మూసాపేట్ మండలం నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ 358వ ర్యాంకు సాధించగా, ప్రస్తుతం ఆయన నల్గొండలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందుతున్నారు. అలాగే ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. విధి నిర్వహణలో ఉంటూనే ఈ విజయం సాధించిన వీరిద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News April 8, 2026
కృష్ణా: నాసిరకం రంగులతో ప్రాణాపాయం.. డ్రింక్స్‌పై నిఘా ఏది?

జిల్లాలో వేసవి వేడిని ఆసరాగా చేసుకొని కల్తీ శీతల పానీయాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానికంగా తయారయ్యే డ్రింక్స్‌లో నాసిరకం ముడిసరకులు, ప్రాణాపాయం కలిగించే ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిల్వ గడువు, శుభ్రతను గాలికి వదిలేసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News April 8, 2026
ఏలూరులో HIV బాధితుల భవనం కబ్జా

ఏలూరులోని వంగాయగూడెంలో HIV బాధితుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయల విలువైన భవనం, స్థలం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 2011లో అప్పటి కలెక్టర్ వాణి ప్రసాద్ దీనిని నిర్మించగా, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దీన్ని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం సొంత అవసరాలకు వాడుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.
News April 8, 2026
మేం కూలీలం: షమీ

‘మేం కూలీలం. మా పని బౌలింగ్ చేయడమే’ అంటూ పేసర్ షమీ తన మనసు విప్పారు. జీవితంలో గాయాలు, ఎత్తుపల్లాలు సహజమని.. గ్రౌండ్ లెవల్‌లో చేసే కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని కుర్రాళ్లకు సూచించారు. అందరూ ఫ్యాన్సీ విషయాల వెనుక పడితే అదే బలహీనత అవుతుందని హెచ్చరించారు. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొడుతున్నా టీమ్ఇండియాలో షమీకి చోటు దక్కడం లేదు. అయినా ఆయన పాజిటివ్ ఆటిట్యూడ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


