News April 17, 2024
సివిల్స్‌లో సత్తాచాటిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డ

సివిల్ సర్వీసెస్ మంగళవారం వెలువరించిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ర్యాంక్ సాధించాడు. మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ సివిల్స్‌లో 718 ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు విశాల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తండ్రి వెంకన్న మంచిర్యాల ACPగా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News April 23, 2025
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజు

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్‌కు చెందిన గాజంగుల రాజు 3వ సారి ఎన్నికయ్యారు. HYDలో మంగళవారం జరిగిన సంఘం మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గాజంగుల రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కీర్తి రమణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దీంతో సంఘం నాయకులు వారి అభినందించారు.
News April 23, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రణయ్

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సదాలి ప్రణయ్ సత్తా చాటాడు. ద్వితీయ సంవత్సరం MPC విభాగంలో 1000కి 991 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి సదాలి బాపన్న-గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో యువకుడిని గ్రామస్థులు అభినందించారు.
News April 23, 2025
విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: SP

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.