News March 6, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.
Similar News
News March 7, 2026
WGL: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం.
News March 7, 2026
బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్‌కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.
News March 7, 2026
విద్యుత్ సరఫరాకు ఆటంకం లేదు: సీఎండీ వరుణ్ రెడ్డి

NPDCL పరిధిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు CMD వరుణ్ రెడ్డి తెలిపారు. సంస్థ పరిధిలోని 70.23 లక్షల సర్వీసులకు పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలందిస్తున్నామన్నారు. ఈ నెలలో అత్యధికంగా 6,441 మెగావాట్ల డిమాండ్ నమోదైనప్పటికీ, ఎక్కడా అంతరాయం లేకుండా సరఫరా చేశామని వివరించారు. నెట్‌వర్క్‌లో 400 కేవీ నుంచి 33 కేవీ వరకు వేల సంఖ్యలో సబ్‌స్టేషన్లు ఉన్నాయన్నారు.


