News March 6, 2026

సివిల్స్ ఫలితాల్లో జనగామ యువకుడి సత్తా

image

సివిల్స్ ఫలితాల్లో జనగామ జిల్లాకు చెందిన భరత్ నాయక్ సత్తా చాటారు. 2023లో ఐఎఫ్ఎస్ కు సెలక్ట్ అయిన ఆయన తాజా ఫలితాల్లో 900వ ర్యాంక్ సాధించారు. ఐఐటి మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఈ సందర్భంగా భరత్ నాయక్ తల్లిదండ్రులు బానోత్ దస్రు నాయక్, అనసూయ దంపతులను జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Similar News

News April 8, 2026

అమెరికా ఓటమిని ఒప్పుకుంది: ఇరాన్

image

అమెరికా ఓటమిని ఒప్పుకొని తమ షరతులన్నింటికీ అంగీకరించిందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.
*ఇకపై దాడులు చేయదు
*హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు
*యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌కు అంగీకారం
*అన్ని ఆంక్షల ఎత్తివేత
*ఇరాన్‌కు పరిహారం చెల్లింపు
*రీజియన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
*ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం
*ఇరాన్ బలగాల అనుమతితో హార్ముజ్ నుంచి ప్రయాణం

News April 8, 2026

ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల కేసు.. దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు..?

image

ద్వారకాతిరుమల <<19593792>>నకిలీ టికెట్ల<<>> కేసులో అసలు దోషులను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈవో వద్ద పనిచేసిన ఓ వ్యక్తిని కాపాడేందుకు ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

News April 8, 2026

హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

image

అమెరికాతో రెండు వారాల సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగినట్లు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాఘ్చీ ధ్రువీకరించారు. సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుంటూ ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్‌తో ఈ రెండు వారాల పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తే, తమ ఆర్మీ కూడా డిఫెన్సివ్ ఆపరేషన్స్‌ను ఆపేస్తుందని చెప్పారు. తమ 10 పాయింట్ల ప్రతిపాదనలపై చర్చించేందుకు US అంగీకరించిందన్నారు.