News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించారు. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
Similar News
News April 22, 2025
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు తెలుగు-39, హిందీ-23, ఇంగ్లిష్-95, లెక్కలు-94, ఫిజిక్స్-24, బయాలజీ-70, సోషల్-106, PET- 72, SGT- 106 జిల్లా విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే DSC దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, మే- 15వ తేదీతో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. జూన్ 6, జూలై 6 తేదీల మధ్యలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.
News April 22, 2025
J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
News April 22, 2025
తిరుపతయ్య కుటుంబీకులకు చెక్కు అందజేసిన ఎస్పీ

కాగజ్‌నగర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కాగా ఆయన భార్య రాధికకు భద్రత ఎక్స్‌గ్రేషియా రూ.8,00,000, కార్పస్ ఫండ్ రూ.50,000, విడోస్ ఫండ్ రూ.10,000 చెక్కులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వపరంగా చెందే ఇతర బెనిఫిట్లను అందేలా చూస్తామన్నారు.