News April 23, 2025

సివిల్స్ సర్వీసెస్‌లో నల్లమల వాసి సత్తా

image

అమ్రాబాద్ మండలం మన్ననూరుకి చెందిన మండలి లింగయ్య కుమారుడు మండలి సాయికిరణ్ నేడు ప్రకటించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 298 ర్యాంకు సాధించాడు. లింగమయ్య పెద్దకొత్తపల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సాయికిరణ్ ఐఏఎస్ సాధించడం పట్ల మన్ననూరు అంబేడ్కర్ కాలనీ ప్రజలతోపాటు అమ్రాబాద్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 23, 2025

టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla

News April 23, 2025

టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

image

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

image

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.

error: Content is protected !!