News November 5, 2025

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు ఈ నెల 11 నుంచి ప్రారంభం

image

మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈ నెల 11, 12, 13వ తేదీల్లో జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. కలెక్టర్‌ అనుమతితో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాలలో 11, 12న వివిధ క్రీడలు, కర్నూలులో 13న స్విమ్మింగ్‌ పోటీ ఉంటుందని తెలిపారు.

Similar News

News March 9, 2026

వికారాబాద్ కలెక్టరేట్‌లో కుక్కల బెడద!

image

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కుక్కల స్వైర విహారం ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది. కొంతకాలంగా కుక్కలు గుంపులుగా తిరుగుతూ విధులకు వచ్చే ఉద్యోగులపై దాడులకు తెగబడుతుండటంతో భయం పట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ లోపలికి కూడా కుక్కలు ప్రవేశిస్తుండటంతో ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతున్నామని, కుక్కల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

News March 9, 2026

కుటుంబ కలహాలపై 20 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRSలో 58 పిటిషన్లు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించి 13, కుటుంబ కలహాలపై 20, ఇతర విభాగాలకు చెందిన 25 అర్జీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు.

News March 9, 2026

కిమ్ వంతేనా? ట్రంప్ ‘డికాపిటేషన్’ స్కెచ్!(1/2)

image

అమెరికా అనుసరిస్తున్న ‘డికాపిటేషన్ స్ట్రైక్’ వ్యూహం ఇప్పుడు ప్రపంచ నియంతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మదురో బందీ కావడం, ఖమేనీ మృతిచెందడంతో.. తదుపరి లక్ష్యం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కానున్నారా? అనే చర్చ మొదలైంది. అమెరికా పాత సిద్ధాంతం ‘లీడర్‌షిప్ టార్గెటింగ్’ను ట్రంప్ ఆచరణలోకి తేవడంతో ప్యాంగ్‌యాంగ్‌లో భయం నెలకొంది. అయితే తమ జోలికి వస్తే అణుదాడి తప్పదని కిమ్ హెచ్చరిస్తున్నారు.