News June 16, 2024

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలకు సర్వం సిద్ధం: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ట్రెజరీలో ఉన్న ప్రశ్న పత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. జూన్ 16వ తేదీన 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News January 30, 2026

అనంత: ‘పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులివ్వాలి’

image

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.

News January 29, 2026

అతివేగం, మద్యం తాగి వాహనం నడపకండి: ఎస్పీ

image

ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 200 మంది డ్రైవర్లకు ECG, 2డీ ఎకో, కంటి, దంత పరీక్షలను GGH వైద్యుల చేత నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదని, అది మనందరి కర్తవ్యమని అన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని సూచించారు.

News January 29, 2026

జిల్లాలో బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

image

అనంతపురం జిల్లాలో కొత్త బార్ పాలసీలో భాగంగా 7 బార్ల దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో మూడు, గుంతకల్లులో రెండు, తాడిపత్రి, రాయదుర్గంలో ఒక్కో బార్ కోసం జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 4న దరఖాస్తులు స్వీకరించి, 5న లాటరీ నిర్వహిస్తారు. అప్లికేషన్ కోసం రూ.5లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.