News March 2, 2025
సి. బెళగల్ : చెట్టు విరిగి పడి బాలిక మృతి

సి.బెళగల్ మండలం పోలకల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం చెట్టు విరిగిన పడి 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ గాయపడిన విషయం తెలిసిందే. కాగా బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇది దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి విద్యాశాఖ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని NUSI జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.
Similar News
News September 13, 2025
అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య జిల్లాలో 3 బార్లకు దరఖాస్తుల గడువు పొడిగించారు. రాయచోటి 1, మదనపల్లె 1, పీలేరు 1 చొప్పున బార్లకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్దేశిత సమయానికి ముందుగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. లాటరీ పద్ధతిలో కేటాయింపు 18వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ PGRS హాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
News September 13, 2025
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్‌గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
News September 13, 2025
HYD: 9999 నంబరుకు రూ.25 లక్షలు

ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే భారీగా ఆదాయం వచ్చింది. TG 09 G 9999 నెంబర్‌ను రూ.25,50,200కు, TG 09 H 0009ను రూ. 6,50,009, TG 09 Η 0001ను రూ.6,25,999, TG 09 Η 0006ను రూ.5,11,666, TG 09 H 0005ను రూ.2,22,000కు పలువురు ప్రముఖులు దక్కించుకున్నారు. దీంతో మొత్తం రూ.63,77,361 ఆదాయం సమకూరింది.