News February 13, 2025

సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే చర్యలు: పౌరసరఫరాల శాఖ

image

బకాయి సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే ఆస్తులు జప్తు చేస్తామని వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎం జగన్మోహన్ హెచ్చరించారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలని అన్నారు. లేదంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News September 16, 2025

దీర్ఘకాలిక సంతోషానికి ఈ అలవాట్లు

image

* రోజూ 30 ని.ల పాటు సాధారణ వ్యాయామం (నడక, యోగా, సైక్లింగ్) చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు, సెరోటోనిన్లు పెరుగుతాయి.
*7-9 గంటల నాణ్యమైన నిద్ర వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగై, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ధ్యానం చేయాలి.
* కుటుంబం, స్నేహితులు, సమాజంతో సమయం గడపడం వల్ల దీర్ఘకాలిక సంతోషాన్ని పొందవచ్చు.
* ఇతరులకు సహాయం చేయడం వల్ల పొందే సంతోషం, తమ కోసం ఖర్చు చేయడం కంటే ఎక్కువ కాలం ఉంటుంది.

News September 16, 2025

నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

image

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 16, 2025

ఉమ్మడి కృష్ణాలో మిగిలిపోయిన 10 టీచర్ పోస్టులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1198 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1208 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1198 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 10 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఈ నెల 19న వీరికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.