News August 30, 2024
సీఎంకు కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వానం

వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబును కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అధికారులు, పూతలపట్టు MLA మురళీ మోహన్ కలిశారు. స్వామివారి శేషవస్త్రాలతో CMను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను CM చేతుల మీదుగా ఆవిష్కరించి ఆహ్వానించారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి నారాయణ రెడ్డిని, CS నీరభ్ కుమార్‌ను కూడా బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.
News February 19, 2026
చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.


