News July 3, 2024

సీఎంకు తుమ్మల లేఖ

image

భద్రాచలం మండలంలోని ఆంధ్రాలో కలిపిన 5గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, విభజన చట్టంలోని హామీలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో 5గ్రామ పంచాయతీలను కలపాలని లేఖ ద్వారా తుమ్మల సీఎంను కోరారు.

Similar News

News March 3, 2026

నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్‌

image

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 3, 2026

పిడుగుల నుంచి విద్యుత్ రక్షణ.. 109 అరెస్టర్ల ఏర్పాటు

image

రుములు, మెరుపుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఖమ్మం సర్కిల్ వ్యాప్తంగా 109లైట్నింగ్‌ అరెస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. పిడుగుల నుంచి వచ్చే అధిక వోల్టేజ్‌ను ఇవి భూమిలోకి మళ్లించి ఉపకరణాలను కాపాడుతాయని వివరించారు. ముందస్తు చర్యలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు కూడా విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News March 2, 2026

99 రోజుల ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్‌

image

ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగే ఈ కార్యాచరణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టం చేశారు.