News September 6, 2025
సీఎంతో అనకాపల్లి డీసీఎంఎస్ ఛైర్మన్ భేటీ

అనకాపల్లి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అభివృద్ధికి సహకారం అందించాలని చైర్మన్ కోట్ని బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసి డీసీఎంఎస్‌కు సంబంధించి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విశాఖలో డిసిఎంఎస్ ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, విద్యార్థులకు పుస్తకాలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
Similar News
News September 6, 2025
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి కవలలు జననం

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి శుక్రవారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త జానకిరామ్ RPF సిబ్బందికి సమాచారం అందించారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపి డాక్టర్‌ను పిలిపించారు. గర్భిణి రైలులో రైలులో ఆడ శిశువు, ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిది. తల్లి, శిశువులను ఆసుపత్రికి తరలించారు.
News September 6, 2025
అమీన్‌పూర్‌లోనే నవోదయ పాఠశాల: ఎంపీ

సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను అమీన్‌పూర్‌లోనే ఏర్పాటు చేయాలని ఎంపీ రఘునందన్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై నవోదయ డిప్యూటీ కమిషనర్ అభిజిత్ బేరాకు శనివారం వినతిపత్రం సమర్పించారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.1500 కోట్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. అధికారులు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు.
News September 6, 2025
పాలమూరులో మైక్రో బ్రూవరీలకు అనుమతి

MBNR జిల్లాలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వెయ్యి గజాల స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, తయారైన బీర్లను అక్కడే విక్రయించాలని సూచించారు. 36 గంటల్లోగా అమ్ముడుపోని బీర్లను పారేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. అనుమతి పొందిన వారు ఆరు నెలల్లోగా యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.